అధికార పార్టీ అన్యాయాలను వివరిస్తూ...

అధికార పక్ష అన్యాయాలను ప్రజలకు వివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భరోసా ఇస్తున్నారు. అశేష జనసందోహం నడుమ కొనసాగుతున్న పాదయాత్ర నేడు 60వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గం పాత వేపకుప్పం శివారు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఎల్వీ పురం క్రాస్‌, నేతకుప్పం, తిమ్మరాజుపల్లి, గొల్లపల్లి, సి. కాలేపల్లికి చేరుకుంటుంది. 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం మధ్యాహ్నం 3గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చిటతూరు, హరిజనవాడ, రాయలచెరువుల విూదుగా కుప్పం బాదురు వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. దారిపొడవునా ఆయన ప్రజలతో మమేకం కానున్నారు. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 818.2 కిలోవిూటర్లు నడిచారు.

Comments