అమ్మోనియా గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన వాస్కో సిటీలో చోటుచేసుకుంది.
ఎయిర్‌పోర్టు-చికలిమ్ రహదారిలో బోల్తా పడిన ట్యాంకర్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకైంది. గ్యాస్ లీకేజీతో ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు అస్వస్థతకు లోనయ్యారు.
వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ కలెక్టర మహదేవ్ అలొండేకర్ ఆదేశాల మేరకు సమాచారమందుకున్న విపత్తు నిర్వహణా బృందం, పోలీసులు అక్కడకు చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. మొర్ముగావో పోర్టు ట్రస్ట్ నుంచి జువారీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు అమ్మోనియా గ్యాస్‌ను తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.

Comments
Post a Comment