క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ గారాల పట్టి సారా టెండుల్కర్‌ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. సచిన్ ఇంటి ల్యాండ్ లైన్ నంబర్‌కు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే కిడ్నాప్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయాన్ని సారా.. సచిన్‌కు చెప్పడంతో ముంబై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల పశ్చిమ బంగాలోని మిడ్నపూర్‌కు చెందిన 32 ఏళల దేవ్ కుమార్‌ను అరెస్టు చేశారు. టెలిఫోన్ టవర్ ఆధారంగా అతడు ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించి పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. అయితే దేవ్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అయినా పోలీసులు దేవ్ ను ముంబైకి తీసుకువచ్చారు. కోర్టులో అతడ్ని హాజరు పరచనున్నారు.

Comments
Post a Comment