సూర్యతో వీళ్లద్దరు.

సాయిపల్లవి..తెలుగులో రెండు చిత్రాలతో పెద్ద హీరోయిన్‌ అయిపోంది. ఆమె ఉంటే చాలు యువకులు ఎగపడి మరీ సినిమా చూసే స్థాయికి వచ్చింది. అలాగే రకూల్‌ హాట్‌ హాట్‌ అందాలతో మైమరిపిస్తోంది. తక్కువ కాలంలో ఎక్కువ చిత్రాలు చేసింది. ప్రధాన హీరోల సరసన నటిస్తూ ఫుల్‌ జోష్‌గా సాగిపోతోంది. సాయిపల్లవి ఎక్స్‌పోజింగ్‌ దూరంగా ఉంటూ అలరిస్తూంటే...రకూల్‌ అందాల ఆరబోతకు అడ్డుచెప్పడం లేదు. మరి ఆ ఇద్దరు కలిసి నటిస్తే..ఇక అభిమానులకు పండగే.. ఆ కల నెరవేరబోతోంది త్వరలోనే...సూర్య 36వ చిత్రంలో మొదట రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను హీరోయిన్‌ సెలక్ట్‌ చేశారు. ఆ తరువాత సాయిపల్లవిని తీసుకున్నట్టు ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. తాజా కబురేంటంటే..ఈ చిత్రంలో సాయిపల్లవి, రకూల్‌ ఇద్దరూ ఉన్నారట. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో పూర్తి యాక్షన్‌ మూవీ ఇది.  

Comments