అజ్ఞాతవాసికి తెలంగాణలో షాక్‌

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి సినిమాకు పోలీసులు షాక్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నైనా ప్రీమియర్‌ షోలు వేసుకునేలా అనుమతి ఇచ్చిన సర్కారు..అదే విధంగా తెలంగాణలో కూడా అనుమతులున్నాయని అన్ని సిద్ధం చేసుకంటున్న సమయంలో పోలీసులు నో చెప్పారు. తెలంగాణలో ఒక్క ప్రీమియర్‌ షో వేసినా ఊరుకునేది లేదని థియేటర్ల యాజమాన్యాలను హెచ్చరించారు. అయితే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందన్న కారణంతో పోలీసులు ప్రీమియర్‌ షోలకు అనుమతి నిరాకరించారు. ఫ్యాన్స్‌ కోసం అర్ధరాత్రి ప్రత్యేక షోలు వేసేందుకు భ్రమరాంభ, మల్లికార్జున, ఆర్కే థియేటర్లలో ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించటంతో రేపు ఉదయం (10-01-2018) ఎనిమిది గంటలకు తొలి షో పడనుంది.

Comments