చెన్నై: అభిమానులపై హీరో సూర్య మండిపడ్డారు. హెల్మెట్లు లేకుండా బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన అభిమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య కథానాయకుడిగా ఇటీవల విడుదలైన గ్యాంగ్ సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సూర్య చెన్నైలో సందడి చేశారు. ఈ సందర్భంగా కొందరు అభిమానులు బైకులపై హెల్మెట్లు లేకుండా ర్యాలీ నిర్వహించారట. దాంతో సూర్య కారు దిగి వారందరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చాలా మంది అభిమానులు బైకులపై హెల్మట్లు లేకుండా వేగంగా దూసుకెళుతున్నారు. వారిలో ఒకరి బైక్ అదుపు తప్పి నా కారు కింద పడబోయింది. వారికేమన్నా జరిగితే అది నన్ను జీవితాంతం వెంటాడుతుంది. దయచేసి అందరూ హెల్మెట్లు ధరించండి' అని సూర్య విూడియా ద్వారా వెల్లడించారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి సూర్య ఎప్పుడూ ముందుంటారు. 2016లో చిత్తూరు ప్రాంతంలో సూర్య కారులో ప్రయాణిస్తుండగా బైక్‌పై వెళుతున్న దంపతులు కిందపడ్డారు. వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. అది గమనించిన సూర్య వెంటనే బాధితులను తన కారులో దగ్గర్లోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

Comments
Post a Comment