పద్మావత్ ఎంత రిలీజ్‌ను అడ్డుకునేందుకు కర్ణిసేన ఎంత అల్లారి పెట్టిందో అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ఆదేశాలనూ విస్మరించి దాడులకు పూనుకుంది. ఇప్పుడు కర్ణిసేన నడ్డి విరిచేందుకు రంగం సిద్ధం అయింది. దీంతో ఎందుకు పద్మావత్‌తో పెట్టుకున్నాం రా బాబూ అన్న పరిస్థితి వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తరువాత ఇందులో ఏమాత్రం అభ్యంతరకర సీన్లు లేకపోవడంతో కర్ణిసేన మరింత ఇబ్బందుల్లో పడిపోయింది. విధ్వంసాన్ని గర్వకారణంగా చెప్పుకుంటూ రోడ్లమీద స్వైరవిహారం చేసిన రాజపుత్రులు.. ఇప్పుడు తోక ముడుస్తున్నారంటూ విమర్శలు పడిపోతున్నాయి. సినిమా విడుదలై ప్రదర్శనలు మొదలైతే థియేటర్ల దగ్గర మాత్రమే ప్రతాపం చూపుతామన్న శ్రీ రాజ్ పుత్ కర్ణిసేన.. ఆ తర్వాత తమ వీరంగాన్ని అన్ని దిక్కులకూ పాకేలా చేసి విశృంఖలత్వం కనబరచడంతో.. అనేక విమర్శలకు దొరికిపోయారు. మొదట్లో వాహనాలు తగలబెట్టడం, దుకాణాలు మూసివేయించడం లాంటి చర్యలతో జనంలో భయానక వాతారవరణం సృష్టించారు. కానీ .. ఢిల్లీ సవిూపంలో గుర్గావ్ వద్ద స్కూల్ బస్సును తగలబెట్టి తమ వికృత రూపాన్ని బైట పెట్టుకుంది కర్ణిసేన.
'స్కూల్ పిల్లలపైనా మీ ప్రతాపం'' అంటూ అటు ఢిల్లీ సర్కారు, ఇటు కేంద్ర ప్రభుత్వం గట్టిగా నిలదీశాయి. ఘటనకు సంబంధించి 18 మంది కర్ణిసేన యువకులను అరెస్ట్ చేసి జ్యుడీషియరీ రిమాండ్ కు పంపారు పోలీసులు. ఖాకీలు రంగంలోకి దిగి చర్యలు మొదలవడంతో.. కర్ణిసేన డిఫెన్స్‌లో పడిపోయింది.
ఇటువంటి అనైతిక, కిరాతక చర్యలు మాకు తెలీవని, బస్సు దగ్ధం వెనుక ఖచ్చితంగా భన్సాలీ హస్తం ఉందని కర్ణిసేన ఆరోపిస్తోంది. సానుభూతి కోసం పద్మావతి డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, అతడి నెట్వర్క్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని శ్రీ రాజ్ పుత్ కార్ని సేన నేత లోకేంద్ర సింగ్ అంటున్నారు. దీనికి.. ఆ దర్శకరత్న ఏమని స్పందిస్తారో చూడాలి!

Comments
Post a Comment