బెంగళూరును వణికిస్తున్న బర్డ్‌ఫ్లూ

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలోని ఎలహంక ప్రాంతంలోని దశరహళ్లి ప్రాంతంలో బర్డ్‌ ఫ్లూతో కోళ్లు మరణించిన ఘటన బెంగళూరు నగరంలో కలకలం రేపుతోంది. బెంగళూరు జంతుప్రదర్శనశాలలో వన్యప్రాణుల సంరక్షణ శాఖ అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. జూపార్కులో ఉన్న పక్షులకు బర్డ్‌ ఫ్లూ వైరస్‌ సోకిందా అని పశువైద్యాధికారులతో పరీక్షలు చేపిస్తున్నారు. మైసూర్‌ నగరంలోని జయచామరాజేంద్ర జూలాజికల్‌ గార్డెన్‌ లో ని వివిధ రకాల పక్షులున్న ఎన్‌ క్లోజరును మూసివేశారు. బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తి చెందకుండా స్ప్రేయింగ్‌ చేశారు. జూపార్కులోకి వాహనాల రాకపోకలను నిషేధించారు. బర్డ్‌ ఫ్లూ భయంతో చికెన్‌ అమ్మకాలు సైతం గణనీయంగా తగ్గాయి.

Comments