నానితో కాజల్‌

నాగార్జున, నాని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో నాగ్‌ సరసన రకూల్‌ ప్రీత్‌ నటించే అవకాశాలున్నట్టు ఓ వార్త వైరల్‌ అవుతుండగా..నాని సరసన కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నట్టు ఫిల్మ్‌నగర్‌ మాట. భలే మంచిరోజు ఫేం శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్షన్‌లో ఈ చిత్ర ం రూపుదిద్దుకోనుంది. ఇందులో నాగ్‌ డాన్‌ పాత్రలో మెప్పించనున్నాడు. ఇప్పటికే నాగ్‌ పాత్రను చాలా డిఫరెంట్‌గా డిజైన్‌ చేస్తున్నట్టు తెలిసింది. ఎప్పుడూ నూతనత్వాన్ని కోరుకునే నాగార్జున ఈ పాత్ర కోసం డిఫరెంట్‌ లుక్‌తో అలరించనున్నాడట. అలాగే నాని ఇంతవరకూ టచ్‌ చేయని పాత్రలో నటిస్తున్నాడట. నాగార్జున...నాని కాంబినేషన్‌పై ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలావుండగా..శర్వానంద్‌ నో అన్న కృష్ణార్జునుల యుద్ధం చిత్రంలో నాని నటించిన విషయం నెట్‌ఇంట్లో తెగ ప్రచారమవుతోంది. అయితే దీనిపై నాని స్పందించాడు. శర్వాకు అసలు కథే వినిపించలేదు. మేర్లపాక గాంధీ మొదటిసారి కథ నాకే వినిపించాడని నాని విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. అలాగే నాని నిర్మాతగా మారి అ! అనే చిత్రం తీసిన సంగతి తెలిసిందే. చిత్రం పర్తయింది. చాలా అద్భుతంగా వచ్చింది. అయితే రిలీజ్‌ తేదీలో ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ముందుగా అనుకున్నట్టు ఫిబ్రవరిలో రావాలని నిర్ణయించుకున్నా...ఆ నెలలో చాలా సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అ! చిత్రాన్ని పోస్ట్‌పోన్‌ చేయడమే మంచిదని యూనిట్‌ నిర్ణయం తీసుకుంది. కొత్త డేట్‌ను త్వరలోనే ఎనౌన్స్‌ చేస్తాడట.

Comments