హైదరాబాద్ : న్యూఇయర్ వేడుకల్లో ఫుల్‌గా మందేసి పోలీసులకు దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరుకానున్నాడు. సోమవారం బేగంపేట ట్రాఫిక్ పీఎస్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకానున్నట్లు పోలీసులకు సమాచారమందించాడు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్ సమాచారాన్ని ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఇంతవరకూ కౌన్సెలింగ్ కు రాకపోవడంతో ఆయన కార్యాలయం..ఇంటికి వెళ్లిన పోలీసులు ఉత్త చేతులతో తిరిగి వచ్చారు. ఆపై ప్రదీప్ పరారీలో ఉన్నట్టు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీంతో ప్రదీప్ ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడికీ పారిపోలేదని, షూటింగ్ బిజీ వల్ల కౌన్సెలింగ్ కు హాజరుకాలేకపోయానని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం కౌన్సెలింగ్ కు హాజరవుతానని చెప్పడంతో ఆసక్తి నెలకుంది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, కౌన్సెలింగ్ కు భార్య లేదా తల్లితో పాటు హాజరు కావాల్సి వుంటుంది. ప్రదీప్ కు పెళ్లి కాలేదు కాబట్టి, తల్లిని తీసుకు రావాలని పోలీసులు చెబుతున్నారు.

Comments
Post a Comment