కొందరు ఎంత పెద్ద హీరోయిన్ అయినా పద్ధతిగా ఉంటారు. అలనాటి మహానటి సావిత్రి ఏ ఫంక్షన్‌కు వచ్చినా ఎంతో హుందాగా..చూడగానే మన కుటుంబ సభ్యురాలిగా కనిపించే విధంగా కట్టు..బొట్టుతో ఆకట్టుకునేవారు. అలాగే సౌందర్య కూడా సావిత్రిలాగే ఇమేజ్ తెచ్చుకుని తెలుగింటి ఆడపడుచులా కనిపించేవారు. మరి ఈ తరంలో కూడా అనుష్క, శ్రియ తదితరులు ఆయా ఆడియో కార్యక్రమాలకు సినిమాను బట్టి ట్రెండీగా డ్రెస్ సెన్స్‌తో ఆకర్షిస్తున్నారు. మరి ఈ యాంకరమ్మ ఎందుకింత హోయలు పోతుందో గాయత్రీ ఆడియో ఫంక్షన్ చూసినవాళ్లకెవరికైనా అనిపించక మానదు. ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్విట్టర్‌లో తన ఆవేదన వెళ్లగక్కిన ఈ అమ్మడు...గాయత్రి ఆడియో ఫంక్షన్‌లో అందరూ ఎంతో పద్ధతిగా డ్రెస్‌లు, శారీలతో డీసెంట్‌గా వస్తే అనసూయ మాత్రం ఎదభాగం కనిపించేటట్టు అ'డ్రెస్' చేసింది. స్టేజి మీదకు వెళ్లి డ్రెస్ సుర్దుకుంటూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితీ ఏర్పడింది. ఇంత అందాల ఆరబోత అవసరమా? అంటూ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది. ఆడియో ఫంక్షన్‌లో ఇలా హాట్‌హాట్ కనిపిస్తే నాలుగు సినిమాల్లో అవకాశాలు వస్తాయని అందుకే ఇలా హాట్‌హాట్‌గా కనిపిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తోటి యాంకర్లు ఎంతో డీసెంట్‌గా దూసుకుపోతుంటే అనసూయ, రేష్మిలు మాత్రం బుల్లితెరపై గ్లామరసంతో నెట్టుకొస్తున్నారు. అనసూయ ఇలాంటి డ్రెస్‌లు వేసుకుని వచ్చినప్పుడు కుర్రకారు కామెంట్లు చేయడం సహజం..దీనిని కూడా లైట్ తీసుకోవాలని నెట్‌జనులు చురకలు వేస్తున్నారు.. అనసూయా..వింటున్నావా..మరి..!!

Comments
Post a Comment