పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అఙ్ఞాతవాసి' ఒకవైపు థియేటర్లలో సినిమా సందడి చేస్తుండగా.. మరోవైపు ఈ చిత్రంపై స్పందించారు ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సాలీ. ఈ చిత్రాన్ని ఫ్రాన్స్‌లో అభిమానుల మధ్యలో చూసిన జెరోమ్ సాలీ.. 'అఙ్ఞాతవాసి' తన సినిమా 'లార్గో వించ్'కు కాపీనే అంటూ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన స్పందించారు. ఫ్యాన్స్ మధ్య ఈ చిత్రాన్ని చూడటం చాలా సంతోషంగా అనిపించింది. మూవీ నాకు బాగా నచ్చింది. అయితే నా చిత్రానికి, 'అఙ్ఞాతవాసి'కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని'' అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఈ చిత్రం కాపీ అని తేలిపోయింది. అంతేకాదు సినీ దర్శకుడు కత్తి మహేష్ చెప్పిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నిజమయ్యాయి. అయితే 'అఙ్ఞాతవాసి' టీజర్ విడుదలైనప్పుడే ఈ చిత్రం 'లార్గో వించ్'ను పోలి ఉందని కామెంట్లు వచ్చాయి. మరోవైపు 'లార్గో వించ్' రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్న 'టీ సిరీస్' కూడా 'అఙ్ఞాతవాసి' టీంకు నోటీసులు అందించినట్లు తెలిసింది.

టైటిల్ బాగుంది.
ReplyDelete