వీళ్లపై కన్నేసిన చరణ్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల చిత్రాల్లో ప్రత్యేక గీతాలు తప్పనిసరిగా మారాయి. మాస్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకునే ఐటెం సాంగ్‌ ఖచ్చితంగా సినిమాలో ఉండేలా చూసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. కాజల్‌, తమన్నా, శ్రుతిహాసన్‌, శ్రియా వంటి హీరోయిన్లు సైతం ప్రత్యేక గీతాల్లో నటించారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ నటిస్తోన్న 'రంగస్థలం' సినిమాలో హీరోయిన్‌ పూజా హెగ్డే ఐటెం సాంగ్‌లో నటించడానికి అంగీకరించింది. ఈ సినిమా తరువాత బోయపాటి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ మరో సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వానీ కనిపించనుంది. బోయపాటి తనదైన స్టైల్‌ లో ఊరమాస్‌ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సినిమాకు అదనపు ఆకర్షణగా ఐటెం సాంగ్‌ పక్కా ఉండాలని భావిస్తున్నారు. దానికోసం ఏకంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు దీపికా పడుకొనే, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ వంటి తారలను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. మాస్‌ బీట్స్‌ ను కంపోజ్‌ చేయడంలో సిద్ధహస్తుడైన దేవిశ్రీప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషం.

Comments