కత్తికి పదునుపెడుతూ పీకేను ఎండగడుతూ..


  •  టీవీ9 కొత్త పాలసీ..

అది కాటమరాయుడు ఆడియో ఫంక్షన్‌. ఈ కార్యక్రమానికి టీవీ 9 సీఈవో రవిప్రకాష్‌ ఓ ముఖ్య అతిథి. మీడియాలో ఇదో పెద్ద హాట్‌ టాపిక్‌. రవి చాలా ముదురు..వపన్‌ కల్యాణ్‌ స్ట్రాటజీ ఉన్న నటుడు. వీళ్లద్దరి కలయిక అనేక అనేక సందేహాలకు..మరెన్నో అంచనాలకు దారితీసింది. త్వరలోనే రవిప్రకాష్‌, ఎన్‌టీవీ నరేంద్ర చౌదరి కలిసి ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ ప్లాన్‌ చేస్తున్నారని..దీనికి పవన్‌ మద్దతు కూడా ఉందని..అంతా గుసగుసలాడారు. 2019 ఎన్నికల నాటికి జనసేనకు కూడా ఓ చానల్‌ ఉంటే జనాల్లోలో తమ అభిప్రాయాన్ని సులువుగా తీసుకువెళ్లవచ్చని పీకే ప్లాన్‌. అందుకే పీకే, రవి, నరేంద్ర ముగ్గురూ కలిని ఓ చానల్‌ ప్లాన్‌ చేశారని ఇన్‌సైడ్‌ టాక్‌. అయితే ఇప్పుడు రవిప్రకాష్‌కు..పవన్‌కల్యాణ్‌కు మధ్య గ్యాప్‌ పెరిగిందట. ఒకరి ఆధిపత్యం ఒకరికి నచ్చడం లేదట. మామూలుగానే రవి ప్రకాష్‌ ఎక్కడున్నా ఎదుట వ్యక్తి డామినేట్‌ చేయడానికే చూస్తాడు. అక్కడే పవన్‌కు..రవికి దూరం పెరిగినట్టు ప్రచారం జరుగుతుంది. ఇంతలో మీ ఇద్దరి ఆజ్యం పోసేందుకు నేనున్నానంటూ కత్తి పట్టుకుని తిరుగుతున్న మహేష్‌ను టీవీ9 స్టూడియో కూర్చొపెట్టి లైవ్‌ మీద లైవ్‌ ప్లాన్‌ చేశారు. కత్తి వ్యాఖ్యలు నిజమేనా? ఎస్‌ అయితే వై అని, అబద్ధమైతే నో అని ఎస్‌ఎంఎస్‌ పంపండని పబ్లిక్‌ పోల్‌ కూడా నిర్వహించేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకేం సమస్యలు లేనట్టు.. కత్తికట్టిన కవరేజ్‌తో తన సరదా తీర్చుకుంది. నిజంగా పవన్‌కు సన్నిహితుడిగానే ఉంటే టీవీ9 ఈ పని చేస్తుందా? ఎక్కడో వీరిద్దకీ చెడింది..అందుకే పవన్‌పై విమర్శలు గుప్పిస్తున్న కత్తి మహేష్‌ వెంట టీవీ9 కెమేరాలు పట్టుకుని వెంటపడుతోంది. బైట్ల కోసం తాపత్రయ పడుతుంది.

Comments