బులియన్ డీలర్ల నుంచి డబ్బు తీసుకుని స్మగ్లింగ్



రూ. 3.21 కోట్లతో మ‌హిళ అరెస్టు

ఢిల్లీ :-  ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగిని రూ. 3.21 కోట్లతో  పట్టుబడ్డారు. భారీ మొత్తంలో నగదు కలిగి ఉన్న ఆమెను డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉద్యోగిని ఢిల్లీ - హాంకాంగ్ జెట్‌ఎయిర్‌వేస్‌లో వెళ్లే క్రమంలో పట్టుబడ్డారు. ఉద్యోగిని నుంచి 4,80,200 డాలర్ల(రూ. 3.21 కోట్లు)ను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. అయితే ఢిల్లీకి చెందిన అమిత్ మల్హోత్రా అనే వ్యక్తి పలు విమానాల సిబ్బంది ద్వారా విదేశాలకు డబ్బు పంపి.. అక్కడ బంగారం కొని స్వదేశానికి తెప్పిస్తున్నట్లు డీఆర్‌ఐ విచారణలో తేలింది. ఈ క్రమంలో జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగినితో పాటు అమిత్ మల్హోత్రాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు పేర్కొన్నారు. బులియన్ డీలర్ల నుంచి డబ్బు తీసుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్లు విచారణలో అధికారులు నిర్ధారించారు. ఆరు నెలల క్రితం జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగినితో మల్హోత్రాకు పరిచయం ఏర్పడిందని తెలిపారు. సంవత్సర కాలం నుంచి మల్హోత్రా.. విమానాయాన సిబ్బంది ద్వారా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు...

Comments