ప్ర‌దీప్ వీడియో చూశాం

హైద‌రాబాద్ : యాంక‌ర్ ప్ర‌దీప్  రెండు రోజుల్లో కౌన్సిలింగ్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అడిష‌న‌ల్ డీసీపీ అమ‌ర‌కాంత్‌రెడ్డి అన్నారు. షూటింగ్ బిజీ వ‌ల్ల రాలేద‌ని ప్ర‌దీప్ వీడియో చూశాం. గ‌డువులోగా ప్ర‌దీప్ కౌన్సెలింగ్ రాకుంటే  చార్జిషీట్ వేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. కోర్టు అనుమ‌తితో అరెస్టు చేస్తామ‌ని పేర్కొన్నారు. త‌ల్లిదండ్రుల స‌మ‌క్షంలో ప్ర‌దీప్‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజ‌రుకాని విష‌యంలో వీఐపీల‌కే కాదు..సామాన్యుల‌కు కూడా గ‌డువు ఇస్తామ‌ని అడిష‌న‌ల్ డీసీపీ అమ‌ర‌కాంత్ రెడ్డి అన్నారు.

Comments