ఆమె పెదవికి ఏమైంది

అతిలోక సుందరికి వయసు పెరుగుతున్నకొద్దీ అందంపై మమకారం పెరుగుతోంది. ఇంకా స్లిమ్‌గా..బ్యూటీగా కనిపించేందుకు తంటాలు పడుతోంది. డైట్‌ మెంటైన్‌చేస్తోంది. తన అందచందాల కోసం తెగ తాపత్రం పడుతోంది. ఈ వయసులో ఇంకా ఎందుకు ఈ మెరుగులు అంటూ నెట్‌ఇంట్లో నెట్‌జనులు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే..ఈ వయసులో అందాల తార శ్రీదేవి సర్జరీ చేసుకోవడమే.. హీరోయిన్లు 'అండర్‌ నైఫ్‌ సర్జరీస్‌- కాస్మొటిక్‌ సర్జరీస్‌' నిరంతరాయంగా చేసుకోవడం సర్వసాధారణం. బాలీవుడ్‌లో ఇదివరకూ ప్రియాంక చోప్రా పెదవి సర్జరీపై బోలెడంత హడావుడి సాగింది. మీడియాలో పీసీ పెదవుల్లో మార్పు చేర్పుల గురించి విస్త్రతంగా కథనాలొచ్చాయి. అందం పెంచుకునేందుకు నానా తంటాలు పడుతోందన్న వార్తలు వచ్చాయి. ఇటీవలే ఓ క్లినిక్‌ నుంచి బయటికి వచ్చిన వాణీకపూర్‌ని మీడియా వెంటాడి అసలు సీక్రెట్‌ కనిపెట్టింది. తనని తాను కవర్‌ చేసుకునేందుకు చేతిని అడ్డుపెట్టుకుని నానా తంటాలు పడింది అంటూ అప్పట్లో కథనాలొచ్చాయి. ఇకపోతే పేరున్న ప్రముఖ బాలీవుడ్‌ నాయికలంతా ఏదో ఒక రూపంలో సర్జరీలు చేయించుకుని అందాన్ని మెరుగుపరుచుకున్నారన్న ప్రచారం ఉంది. తాజాగా ఈ జాబితాలో అతిలోక సుందరి శ్రీదేవి పేరు వినిపిస్తోంది. ఐదు పదుల వయసులోనూ శ్రీదేవి ఇలా అందం పెంచుకునేందుకు సర్జరీల్ని ఆశ్రయించడం చర్చకొ చ్చింది. మొన్నటికి మొన్న అనురాగ్‌ కశ్యప్‌ నిర్వహించిన సరస్వత్‌ పూజాకార్యక్రమాలకు విచ్చేసిన శ్రీదేవి ముఖంలో కనిపించిన కొత్తదనాన్ని మీడియా పసిగట్టేసింది. పదే పదే శ్రీదేవి పెదవి సౌందర్యంపై కాన్‌సన్‌ట్రేట్‌ చేసి వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో పజిల్స్‌ పెట్టింది. శ్రీదేవి పెదవి ఆపరేషన్లు చేయించుకుందని ఆ తర్వాత నానా రచ్చ చేసింది మీడియా. ఉన్నకొద్దీ మైఖేల్‌ జాక్సన్‌లా చేస్తోంది.. ఈ వయసులో సర్జరీలు అవసరమా? అంటూ పంచ్‌లు వేస్తోంది మీడియా. ఇదిగో శ్రీదేవిలోని మార్పుల్ని ఆవిష్కరిస్తున్న ఫొటో.

Comments