మా ప్రదీప్‌ను ఒగ్గేయండి సార్‌..

31వ తేదీ రాత్రి ఫుల్‌గా ఫుల్‌ పీకిన యాంకర్‌ ప్రదీప్‌ లేట్‌గా టచ్‌లోకి వచ్చాడు. షూటింగ్స్‌ బిజీ వల్లే ఫోన్లు లిఫ్ట్‌ చేయలేదని, నేనెక్కడికీ పారిపోలేదని, న్యాయంగా పోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇదిలవుంచితే..ప్రదీప్‌కు కూడా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా ఉంది. బుల్లితెరపై ఆయన హావభావాలు..కామెడీకి యువత ఫుల్‌ ఫిదా అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రంకన్‌ డ్రైవ్‌ కేసుపై ప్రదీప్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అభిమానులు ప్రదీప్‌ చర్యల్ని ఖండిస్తుంటే ..మరికొందరు ప్రదీప్‌ను వదిలేయాలని కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఇన్‌ స్ట్రాగ్రాం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ గ్రూఫ్‌ లో ప్రదీప్‌ ను వదిలేయాలంటూ ఓ యువతి పోస్ట్‌ చేసింది. హనీ భవాని అనే అమ్మాయి..సార్‌ ప్లీజ్‌ మా యాంకర్‌ ప్రదీప్‌ను ఒగ్గేయండి సార్‌.ప్రదీప్‌ చిన్న పిల్లోడు అని ఆమె కామెంట్‌ పెట్టింది. దీనిపై హైదరాబాద్‌ పోలీసు.. చిన్నపిల్లోడు అయితే ఇంట్లో కూర్చుని పాలు తాగాలి..మందు తాగి కార్‌ నడపకూడదు..అంటూ రిప్లై ఇచ్చారు.

Comments