హైదరాబాద్: హైదరాబాద్ శివారు నార్సింగ్ వ్యవసాయ మార్కెట్‌లో పశుసంక్రాంతి జాతర (పశువుల సంత) కన్నుల పండువగా సాగింది. ఈసారి గమ్మత్ పేరు కలిగిన దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నార్సింగ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ యాదవ్.. ఈ విత్తనం దున్నను 5 లక్షలకు విక్రయానికి ఉంచారు. పుట్టిన సమయంలో వింతగా ఉండడంతో గమ్మత్తుగా ఉందని, ఈ దున్నపోతుకు గమ్మత్ అని పేరు పెట్టామని, దీని వయసు మూడేళ్లని తెలిపారు. ఈ గమ్మత్‌ను తిలకించేందుకు జనం ఎగబడ్డారు. కాగా, ఈసారి పశుజాతరలో ధూలియ జాతి గేదెలు అత్యధిక ధరకు అమ్ముడుపోయాయి. రెండు ధూలియా గేదెలను 2.10 లక్షల చొప్పున, మరో రెండు ధూలియా గేదెలను 4.10 లక్షలకు రైతులు విక్రయించారు

Comments
Post a Comment