రెజీనా లవ్‌ చేసింది ఎవర్ని?

అందాల ఆరబోతకు ఎటువంటి మొహమాటం చెప్పని క్యూటీ రెజీనా లవ్‌ పడి మోసపోయానని పేర్కొంది. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. కెరీర్‌ బాగుందనుకునే సమయంలో ఓ హీరోతో డేటింగ్‌ చేసిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఒకే హీరోతో సినిమాలు చేస్తున్న కారణంగా ఆ గాసిప్స్‌ మామూలే కదా అన్నట్టు కొట్టిపారేసింది. తరువాత మరో వర్ధమాన హీరోతో క్లోజ్‌గా మూవ్‌ అవుతోందని, వారిద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తోందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినపడ్డాయి. తాజాగా రెజీన తన మనసులో మాటను వ్యక్తం చేసింది. లవ్‌ చేసి చాలా తప్పు చేసినట్టు పేర్కొంది. ఈ కారణంగానే మంచి అవకాశాలను చేజార్చుకున్నట్టు చెప్పింది. రెజీనా సాయిధరమ్‌ తేజ, నారా రోహిత్‌తో వరుసుగా సినిమాలు చేసింది. మరి ఈ ఇద్దరిలో ఎవర్ని లవ్‌ చేసిందోనని ఫిల్మ్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Comments