కత్తి ఎలా విసురుతున్నాడో తెలియడం లేదు. ఎవరెవరికీ డ్యామేజ్ కలుగుతుందో ఊహించేలోపై ఎన్నెన్నో తిట్లు..మరెన్నో ట్విట్లు. ఈ కత్తి ఎక్కడ నుంచి వచ్చాడో గానీ..పవన్‌తో చాలా వైరమే చేస్తున్నాడు. తనకు తెలిసిన విషయాలు (ఔనో కాదో) మీడియా ముందు నిర్భయంగా చెప్పేస్తున్నాడు. తాజాగా నటి పూనమ్‌కౌర్‌ను లాగాడు. పవన్ మోసం చేస్తే పూనమ్ ఆత్మహత్యకు పాల్పడిందని, గుడిలో పవన్ గోత్రం చెప్పి..ఇద్దరి పేరిట పూజలు చేయించిందని, త్రివిక్రమ్‌తో కలిసి పవన్ క్షుద్ర పూజలు చేయించిన చోట పూనం కూడా ఉందని...ఇలా ఎన్నో విమర్శలు చేశాడు. తన వద్ద పక్కా సాక్ష్యాలు ఉన్నాయని పదునెక్కిన డైలాగ్‌లు చెప్పా కత్తి. దీంతో పవన్ పెద్దగా పట్టించుకోకపోయినా..పూనమ్ మాత్రం చాలా చాలా హర్ట్ అయింది. దీనిపై క్లారిటీ రాకపోతే కెరీర్ మొత్తం నాశనం అవుతుందని ఆవేదన చెందుతుంది. ఈ ఆరోపణలు నుంచి రక్షించేది ఒక్క పవన్ మాత్రమేనని గట్టిగా నమ్ముతోంది. అందుకే పూనమ్ కల్యాణ్ ఉద్దేశించి ట్విట్ చేసింది.
గౌరవనీయులైన పవన్ కల్యాణ్ గారూ..దయచేసి ఈ విపత్కర పరిస్థితులు నుంచి నన్ను బయట పడేయండి. ఎందుకంటే ఇది నా కెరీర్‌కు, నా కుటుంబానికి, అంతకుమించి నా గౌరవానికి సంబంధించిన విషయం. కొంతమంది వ్యక్తుల రహస్య ఎజెండా కోసం రాజకీయంగా లక్ష్యం కావడం నాకిష్టం లేదు. దీనికి సంబంధించి నేను మీతో చర్చించాలనుకుంటున్నాను. మిమ్మిల్ని కలవాలనుకుంటున్నాను...పూనమ్ పెట్టిన ట్వీట్ ఇది. అయితే మరెందుకో..ఎవరినుంచి ఒత్తిడి వచ్చిందో గానీ ట్వీట్ పెట్టిన గంటకే మెసేజ్ డిలీట్ చేసింది.

Comments
Post a Comment