వర్మ..కాంట్రవర్సీకి క్లోజ్ ఫ్రెండ్. శృంగారం నేపథ్యంలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తూ.. రామ్ గోపాల్ వర్మ ఎవరి ఊహకు అందని రీతిలో ముందుకెళుతున్నాడు. నిరంతరం ఆయన వ్యవహార శైలిపై ఆన్‌లైన్‌లో డిబేట్ రన్ అవుతూనే ఉంది. పాశ్చాత్య పోకడలతో మనదైన కల్చర్‌ని పాడు చేస్తున్నాడని విరుచుకుపడేవాళ్లు ఉన్నారు. పచ్చి బూతును ప్రమోట్ చేస్తున్నాడని తిట్టే వాళ్లు ఉన్నారు. ఎవరేమనుకున్నా తానేం చేయాలో అదే చేస్తాడు కాబట్టే వర్మ అయ్యాడు. మొత్తానికి జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్) అంటూ మరోసారి కాంట్రవర్సీకీ పిచ్చిక్కించేలా ప్రమోట్ చేశాడు. దీనిపై మహిళాలోకం పోలీసులు కేసులు కూడా పెట్టింది. అయినా డోంట్ కేర్ అంటూ ముందుకు వెళ్లాడు. అనుకున్నట్టు జీఎస్టీని విడుదల చేశాడు. అయితే వర్మ ఇలా జనాల్ని ఆడుకోవడం వెనక అసలు గేమ్ ఏంటి? అని విశ్లేషిస్తే..
ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ ఓ తెలివైన మైండ్ గేమ్ ఆడుతున్నాడనే చెప్పవచ్చు. జీఎస్టీ వెనక యూట్యూబ్ రేటింగుల్లో దూసుకుపోయే వ్యూహం ఉంది. ఓ రకంగా వర్మపై పలువురు సైకాలజిస్టులు, ఫిలాసఫర్ల ప్రభావం తీవ్రంగా ఉందనే చెప్పాలి. ఆయాన్ ర్యాండ్, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఫ్రెడెరిక్ నీజ్‌చే వంటి ప్రఖ్యాత రచయితలు రాసిన పుస్తకాల ప్రభావం వర్మపై మెండుగా ఉందనడంలో సందేహం లేదు. అతడు 'గన్స్ అండ్ థైస్' కోసం టోరి బ్లాక్ అనే శృంగార తారతో కలిసి పని చేశాడు. ఆ క్రమంలోనే సదరు పోర్న్‌స్టార్ గురించి మాట్లాడుతూ .. టోరి బ్లాక్ మదర్ థెరిస్సా కంటే గొప్పది అన్నాడు. ఓరకంగా గొప్ప శాంతి దూత అయిన మదర్ థెరిస్సానే అవమానించాడు. నిన్నటికి నిన్న జీఎస్టీ ఫేం మియా మల్కోవా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలోనే ధనవంతుడు అంబానీ కంటే గొప్పది అనేశాడు. ఈ వ్యాఖ్యల వెనక టీజింగ్ ఉంది. ఆర్జీవీ పై ఫిలాసఫీ, సైకాలజీ ప్రొఫెసర్ల ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి. తాను ఆడే బంతాటలోకి జనాల్ని ఎంతో తెలివిగా లాగే వర్మ తెలివితక్కువోడు అనుకుంటే అది మన పొరపాటు! గ్రహపాటు!!

Comments
Post a Comment