పిచ్చెక్కిస్తున్న పిక్‌

ప్రియాంక చోప్రా ఎక్కడున్నా హాట్‌ హాటే. తన అందచందాలతో మత్తెక్కించే ఈ సుందరి మరోసారి యువత హృదయాలను హీట్‌ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ప్రియాంక చోప్రా హాట్‌ పిక్‌ పిచ్చేక్కిస్తోంది.క్వాంటికో టీవీ సిరీస్‌లో నటిస్తున్న ప్రియాంకా తాజాగా తన కోస్టార్‌ను కిస్‌ చేసుకున్నది. అది కూడా లిప్‌లాక్‌. క్వాంటికో-3 కోసం జరుగుతున్న షూటింగ్‌లో భాగంగా ప్రియాంకా తన కోస్టార్‌ అలన్‌ పావల్‌కు ఓ రొమాంటిక్‌ సన్నివేశంలో గాఢమైన ముద్దు ఇస్తుంది. ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంకా షేర్‌ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 26 నుంచి క్వాంటికో తాజా సిరీస్‌ ప్రారంభంకానున్నది.

Comments