అనుష్క..ఆ పేరులోనే అందం..అభినయం కలగలిసి ఉన్నాయి. స్టార్ హీరోలకు ధీటుగా జేజేమ్మ ప్రేక్షకుల చేత జేజేలు కొట్టించుకుంటుంది. సంక్రాంతి సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలు డీలా పడ్డాయి. బాలయ్య చిత్రం జై సింహ ఒక్కటే పోటీ లేకపోవడంతో సేఫ్ జోన్‌లోకి వెళ్లింది. అనుష్క నటించిన భాగమతి విడుదలైన మొదటి షో నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ పండగ చేసుకుంటోంది. స్టార్ హీరో ఉంటే బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టొచ్చు అనే సాంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఈబెంగళూరు బ్యూటీ భాగమతితో అదరగొడుతుంది. సినిమా విడుదలతో స్టార్ హీరోలకే బయపడే బయర్లు అనుష్కాను నమ్మి కోట్లు ఖర్చు పెట్టి సినిమాను విడుదల చేశారు. ఆ నమ్మకాన్ని వమ్మ చేయకుండా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనుష్కకు నమ్మకంతో సినిమా విడుదల చేసిన బయ్యర్లకు ఓపెనింగ్స్ భారీగా వచ్చాయని ..వసూళ్ల హవా కొనసాగుతుందని సినీ పండితులు అంటున్నారు. అంతేకాదు సంక్రాంతికి ముందు సంక్రాంతి తరువాత కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. అనుష్క భాగమతి వస్తుందనే ఉద్దేశంతో ముందుగానే జాగ్రత్తపడ్దారు. లేదంటే భాగమతి దెబ్బకు మిగిలిన సినిమాలు నష్టపోయే పరిస్థతి వచ్చేదని ఈ సినిమా కలెక్షన్లు చూసిన క్రిటిక్స్ చెబుతున్నారు.

Comments
Post a Comment