ప్యాషన్‌తో తీసా
ప్యాడ్‌మాన్ వాయిదాకు ఒప్పుకున్న అక్షయ్‌కు రుణపడి ఉంటా : : భన్సాలీ
పద్మావత్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం. షూటింగ్ ప్రారంభం నుంచి ఎన్నె కష్టాలు..మరెన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. విడుదల చేస్తే ఊరుకోబోమని హెచ్చరికలూ కొనసాగుతున్నాయి. సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రిలీజ్ నాటికి ఇంకెన్నీ ఇబ్బందులు ఎదురవుతాయోనని పద్మావత్ టీం ఆందోళన చెందుతోంది. సినిమాను ప్రాణంగా భావించే భన్సాలీ ఈ చిత్రానికి ఏకంగా రూ.200 కోట్లు పెట్టాడు. సినిమా తారుమారు అయితే దాదాపు అతని సినీ జీవితం ట్రాజడీగా మారడం ఖాయం. అయినా సినిమాపై ప్యాషన్‌తో జీవితాన్ని ఫణంగా పెట్టాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడనని చెపుతున్నాడు. అయితే ఈ సినిమాకి ఎంతో ముందు చూపుతో .. ముందు జాత్రత్తతో.. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇన్సూరెన్స్ చేయించారాయన. అందువల్ల 50శాతం అతడు సేఫ్‌లో ఉన్నట్టే. అయినా వందల కోట్ల పందేరంలో ఆట తేడా కొడితే అంతే సంగతి?ఎన్నో వివాదాల సుడిగుండాల మధ్య 'పద్మావత్' జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే అదే రోజున అక్షయ్ కుమార్ 'ప్యాడ్‌మ్యాన్' విడుదలకు సిద్ధమైంది. ఒకే రోజు రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీకొడితే ఆ పరిణామం ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఒకే ఆదాయాన్ని రెండు సినిమాలు పంచుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఇరు సినిమాలకు నష్టమే. ఓపెనింగు రోజే సినిమాకి డివైడ్ టాక్ వస్తే ఇక అంతే సంగతి. ఆ తర్వాత జనం థియేటర్లకు వెళ్లరు. ఆలోచించుకునే లోగానే పైరసీ ఆన్‌లైన్‌లో దాడి చేస్తుంది. ఇన్ని పరిణామాల్ని ఆలోచించిన భన్సాలీ నేరుగా అక్షయ్‌నే వాయిదా వేసుకోవాల్సిందిగా తన గోడు వెల్లబోసుకున్నారు. ఇప్పటికే వివాదాల్లో నలిగిపోయిన పద్మావత్‌ని బతికించేందుకు మంచి మనసున్న మారాజు అక్కీ తన వంతుగా సాయానికి ముందుకొచ్చారు. ఎట్టకేలకు 'ప్యాడ్ మ్యాన్' విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా భన్సాలీ మాట్లాడుతూ-''పద్మావత్‌ను ఎన్నో కష్టాలు ఎదురొడ్డి తెరకెక్కించాను. జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ మా సినిమా 'ప్యాడ్‌మ్యాన్'తో పోటీ కెళుతోంది. అది కరెక్ట్ కాదు. అందుకే అక్షయ్‌ను సినిమా విడుదలను వాయిదా వేసుకోమని కోరాం. అతను ఒప్పుకున్నారు. ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని'' అని ఆనందం వ్యక్తం చేశారు. క్లాషెస్ లేవు కాబట్టి పద్మావతి ఓపెనింగులకు ఇక ఢోకా లేనట్టే.ఇప్పటికే ప్రీరిలీజ్ హైప్‌కి తగ్గట్టు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవ్వడం ఖాయం.

Comments
Post a Comment