ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారికి పెనాల్టీ పాయింట్లు విధించే వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఓ వ్యక్తి 12 పాయింట్ల పరిమితిని దాటాడు. దీంతో అతడి లైసెన్స్ సస్పెన్షన్‌కు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మౌలాలికి చెందిన రుషబ్ మహేంద్ర హేనియా గత ఆరునెలల్లో 13 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడ్డాడు.గత ఏడాది ఆగస్టు 18న హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ మొదటిసారి పట్టుబడగా ఇప్పటివరకు మొత్తం 12సార్లు అదే నేరం చేస్తూ దొరికిపోయాడు. దీంతో అతడి లైసెన్స్‌పై ఒక్కొక్కటి చొప్పున 12 పెనాల్టీ పాయింట్లు చేరాయి. తాజాగా ఈ నెల 6వ తేదీన సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ దొరుకడంతో మరో రెండు పాయింట్లు జత అయ్యాయి. దీంతో ఏకంగా 14 పాయింట్లకు చేరింది. గత ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం పెనాల్టీ పాయింట్లు 12 దాటితే లైసెన్స్‌పై వేటు వేస్తారు.ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రుషబ్ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆర్టీఏ అధికారులకు సిఫారసు చేయగా, మేడ్చల్ జిల్లా ఆర్టీవో పుప్పాల శ్రీనివాస్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రుషబ్ లైసెన్స్ ఏడాదిపాటు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఆరు పెనాల్టీ పాయింట్లు పడిన లైసెన్సుదారులను ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్‌కు పంపిస్తుండటంతో సత్ఫలితాలు వస్తున్నాయి. నిబంధనలు పాటించేవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెనాల్టీ పాయింట్లు పడని లైసెన్సుల నంబర్ల నుంచి లక్కీ డ్రా తీసి విజేతలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ప్రతిపాదన సైతం ఉన్నది...

Comments
Post a Comment