Skip to main content
నిజం, పని, అభివృద్ధి..ఇదే తలైవా తంత్రం
- మూడేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా
- పక్కా ప్లానింగ్‌తోనే రాజకీయ ప్రవేశం
- రజనీ కోసం రెండేళ్లు ఓ సైన్యం
తలైవా వచ్చేశాడు...మామాలుగా రాలేదు..పక్కా ప్లానింగ్..ప్రస్తుత రాజకీయాలపై పూర్తి అవగాహన..జయలలిత మరణానికి ముందు..తరువాత రాజకీయాలపై అధ్యయనం...ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి...ఎవరెవర్ని పోటీ చేయించాలి..పార్టీ పెడితే వచ్చే రెస్పాన్స్ ఏంటి. అభిమానులు ఏం కోరుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు. ఇవన్నీ తెలుసుకున్నాకే ది లీడర్ పార్టీ ప్రకటన చేశారు. ఏ మాత్రం అవగాహన, ఏర్పాట్లు లేకుండా రాజకీయ గ్రౌండ్‌లోకి దిగితే ప్రత్యర్థుల చేతిలో దెబ్బ తినక తప్పదు. ఈ విషయం తలైవాకు తెలుసు..అందుకే గత కొన్నేళ్ల నుంచి ప్రాక్టీసు చేస్తునే ఉన్నాడు. అన్ని అనుకూలిస్తే...అంటూ ఇన్నేళ్లు మురిపించిన రజనీ అన్నీ అనుకూలంగా మార్చుకున్నాకే పార్టీ ప్రకటన చేశాడు. తమళ రాజకీయాలను ఒకేసారి తనవైపు లాక్కున్నాడు. వరుసుగా అభిమానులతో భేటి అవడానికి కారణం కూడా అదే..గ్రౌండ్ రిపోర్ట్. గ్రామీణ ప్రజలు ప్రస్తుత రాజకీయాలపై ఏ విధంగా స్పందిస్తున్నారు. ఒక వేళ తను పార్టీ పెడితే ప్రజలు ఆమోదిస్తారా? అన్న విషయాలను చాలా పగడ్బందీగా ప్రజలనుంచి ఫీడ్ బ్యాక్ రప్పించారు. ఇందులో రజనీ అభిమానుల్లో చాలా మంది నిజాయతీగా కష్టపడ్డారు. చాలా మంది విద్యా వంతులు రజనీ పార్టీలో చురుకైన పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెజార్టీ సీట్లు కూడా విద్యావంతులు, లాభాపేక్ష లేకుండా సేవ చేయాలనుకునేవారికి ఇవ్వాలని ప్రాధమిక నిర్ణయం. డబ్బు, పదవి ఆశతో రాజకీయాల్లోకి రావడం లేదని తలైవా చెప్పడం తమిళులను ఆలోచించేలా చేసింది. దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని... వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. నిజం, పని, అభివృద్ధి ఈ మూడే పార్టీ అజెండా అని తేల్చి చెప్పారు. ఇచ్చిన హామీలు మూడేళ్లలో నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమే. తమిళనాట విశేష జనాభిమానం ఉన్న ఏకైక సూపర్ స్టార్ రజనీ. ఆయన కోసం పనిచేసేందుకు పార్టీలకతీతంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే చెన్నైలో అత్యంత రహస్యంగా ఓ టీం పనిచేస్తోంది. తమిళ ప్రజలను ఆకట్టుకునే పథకాలు..వాటి కార్యాచరణ..ప్రవేశపెట్టబోయే పథకాలకు ఎంత ఖర్చు..ఆ నిధులను ఎక్కడ సమకూరుస్తారు? వంటివి చాలా స్పష్టంగా..ప్రజలకు అర్థమయ్యే రీతిలో..ప్రతిపక్షాలకు వేలు పెట్టలేని రీతిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా తటస్థంగా ఉండే నాయకు ఎంత మంది..వారు తలైవా పార్టీకి పనిచేస్తారా అన్న విషయాలను కూడా సర్వే చేశారు. తమిళనాట ఉన్న విద్యావంతులతో ఇప్పటికే సీక్రెట్‌గా రజనీ మీట్ అయ్యారట. మేథావులు, స్వాతంత్ర సమరయోధులు ఆలోచనలు, సలహాలను తీసుకుని, వాటికి మెరుగులు దిద్ది ఎజెండా రూపొందించడంలో ఈ టీం చాలా కసరత్తు చేస్తోంది. ఇదంత నిన్న మొన్నో జరిగిన తంతు కాదు..గత రెండుమూడేళ్లుగా రజనీ రాజకీయ సైన్యం చేస్తున్న పని. మధ్యమధ్యలో రాజకీయాల్లో రజనీ అంటూ ప్రచారం కూడా ఇందులో భాగమే. రజనీ వస్తున్నాడట...అన్న ప్రచారాన్ని పార్టీ ప్రకటన వరకూ కంటిన్యూ చేయాలని వ్యూహంలోనే భాగమేనట. అందుకే ఆయన పార్టీ ప్రకటన కోసం దేశవ్యాప్తం..ప్రపంచ వ్యాప్తం ఆయన అభిమానులు ఎదురుచూసింది. ఆయన మాటే చాలా మంది వేదం. ఆయన కనుసైగలతో ఓటర్లను ప్రభావితం చేయగలరు. ఇంతటి అభిమానం సంపాదించుకున్న తలైవా..ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలా రాణిస్తారు? ఎంజీఆర్‌లా సీఎం అవుతారా? అన్నది ఊహకందని ప్రశ్న. -పక్కి.వేణుగోపాల్
Comments
Post a Comment