నానితో 'మైత్రి'

స్టార్‌ హీరోలతో భారీ బడ్జెట్‌ చిత్రాలు చేస్తోన్న మైత్రి మూవీస్‌ నిర్మాణ సంస్థ ఇప్పుడు మీడియం రేంజ్‌ హీరోల వెంట కూడా పడుతోంది. ఇప్పటికే నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే విజయ్‌ దేవరకొండ హీరోగా మరో సినిమా చేయబోతున్నారు. తాజాగా నాని, కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌ లో రాబోతున్న చిత్రాన్ని కూడా ఈ బ్యానర్‌ పైనే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. మొదటి చిత్రంతోనే హిట్‌ అందుకున్న దర్శకుడు కిషోర్‌ తిరుమల రెండో సినిమాతో ఏవరేజ్‌ అనిపించుకున్నారు. నాని చిత్రంతో మరో హిట్‌ అందుకోవాలని చూస్తున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో నటిస్తున్నాడు. శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్ట్‌ చేయబోయే మల్టీస్టారర్‌ సినిమాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడు.

Comments