ఆడుకున్నారు ... ఇపుడు నోరు మూసుకున్నారు

చినుకు తాకే సడిలో..చిగురు తొడిగే చెలిమె విరిసే హరివిల్లులే 
ఎదుట నిలిచే నిజమే..కలలు పంచే తీరే..చిలికి చిరునవ్వులే 
మునుపు కనుగొనని ఆనందమేదో కలిగే నాలోన ఈ వేళనే... 
పెళ్లి చూపులు చిత్రంలో ఈ పాట ఇప్పటీకి అందరి పెదాలపైనే ఉంది... 


మెరిసే మెరిసే మనసే మురిసే నేల 
చెలిమి వలెనే చిరు చిరు ఆశలు విరిసెగా 
కదలే యదలో మనకేసెనా తొలి తొలిగా ఆ ఆహా ఆహా ఆ.. 
పాట కూడా పెళ్లిచూపులు చిత్రంలోదే.. 

ఆహా ఎం పదాలు..ఏం భావం..ఫీల్‌ గుడ్‌..మనసు హాయిగా ఉంది. 
పాట ఇలా ఉండాలి...భావం అర్థమవ్వాలి..చిన్న చిన్న పదాల కూర్పుతో అక్షరాలు ఒదిగిన తీరు వావ్‌... ఇక అర్జున్‌ రెడ్డి చిత్రంలో ఈ పాట.... 
మధురమే ఈ క్షణమే ఓ చెలీ 
మధురమే ఈ క్షణమే 
మధురమే వీక్షణమే ఓ చెలీ 
మధురమే వీక్షణమే 
మధురమే... 

ఎంత అందంగా ఉంది కదూ..మరి ఈ పాటలు రాసింది ఎవరు? ఓ సిరివెన్నెల...కాదు కాదు భాస్కరభట్ల..నో..చంద్రబోసా...కాదండీ బాబూ..మరి ఎవరు? రాసింది అతడు..కాదు ఆమె. ఆమె అంటే ఆమె కాదు ఇండస్ట్రీలో నిలదొక్కుకోకుండా కొందరు గాయపరిస్తే..ఆ గాయంలో నుంచి పుట్టికొచ్చిన కసి..పట్టుదలతో పోయిన చోటే గెలవాలన్న మొక్కవోని ధైర్యంతో వచ్చిన సాహిత్య తుఫాను శ్రేష్ట. తెలుగులో తొలి మహిళా సాహిత్య కళాకారిణి. 
అదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలకు చెందిన శ్రేష్ట బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. తండ్రి వ్యాపారవేత్త..తల్లి ప్రభుత్వ ఉద్యోగి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేసింది. ఓ 2013లో ఓ స్నేహితుడి ద్వారా ఒక రొమాంటిక్‌ క్రైం కథ పాటలు రాసే అవకాశం వచ్చింది. శ్రేష్ట రాసిన పాటలు నచ్చడంతో సినిమాల్లో మొత్తం పాటలు రాసే అవకాశాన్ని శ్రేష్టకు అప్పగించారు. ఇలా తొలి చిత్రంతోనే సింగిల్‌ కార్డు వేయించుకున్న ఘనత శ్రేష్టకు దక్కుతుంది. వరుసుగా సినిమాలు చేస్తూ గుర్తింపు పొందింది. 

పురుష అహంకారంలో.. 
స్వయంకృషితో ఎదుగుతున్న సమయంలో తొక్కేయాలనుకోవడం ఇండస్ట్రీలో మామూలే. శ్రేష్టకు ఇలా వేధింపులు..గుర్తుతెలియని వ్యక్తుల బెదిరింపులు..లొంగతీసుకోవడానికి ప్రయత్నాలు..ఇలా అవకాశం ఉన్నవాళ్లు..అడ్వాంటేజ్‌ తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ శ్రేష్ట..లొంగలేదు..పైగా తిరగబడింది. నేను ఎంచుకున్న రంగం పూలబాట కాదు అని నిర్ణయించుకుంది. అంతే ఇండస్ట్రీని వదలేసి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు పోయిన చోటే గెలవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో పెళ్లి చూపులు సినిమాలో పాటలు రాసే అవకాశం వచ్చింది. అంతే గొప్పఅవకాశం భావించి అద్భుతంగా పాటలు రాసింది. శ్రేష్ట రాసిన పాటలు సూపర్‌ హిట్‌. అంతే లొంగతీసుకోవాలని ప్రయత్నించిన వాళ్లు శ్రేష్ట పాటల ముందు లొంగిపోయారు. తప్పదు వారికి మరో దారి లేదు. శ్రేష్టను అభినందించడం తప్ప.. 

విజయ్‌ దేవరకొండ ఫోన్‌... 

పెళ్లి చూపులు సూపర్‌ హిట్‌..అందులో హీరో విజయ్‌ దేవరకొండ. ఈ సినిమాతో విజయ్‌తో శ్రేష్ట స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో అర్జున్‌ రెడ్డి సినిమాకు పాటలు రాయాల్సిందిగా విజయ్‌ ఫోన్‌ చేశారు. వెంటనే శ్రేష్ట చిత్ర యూనిట్‌ను కలవడం..లిరిక్స్‌ రాసివ్వడం జరిగింది. మధురమే ఈ క్షణమే ఓ చెలీ...మధురమే ఈ క్షణమే ఈ పాట ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఇలా శ్రేష్ట తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. 

Comments