తెలంగాణలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు...

హైదరాబాద్‌: విదేశాల్లో ఎక్కువగా తినే డ్రాగన్‌ ప్రూట్‌ ఇక నుంచి తెలంగాణలోనూ విరివిగా దొరుకనుంది. డ్రాగన్‌ ప్రూట్‌ సాగును పెంపకాన్ని ఉద్యానశాఖ ప్రోత్సహిస్తోంది. డ్రాగన్‌ ప్రూట్‌ సాగుకు తెలంగాణ భూములు అనుకూలంగా ఉండడమే అందుకు కారణం. 
గులాబీ పండు పేరుతో కొత్త రకం పంటను తెలంగాణ ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది. గులాబీ పండును చైనాలో డ్రాగన్‌ ప్రూట్‌ అని పిలుస్తారు. దీన్నే అమెరికాలో అమెరికన్‌ బ్యూటీ అంటారు. అయితే ఈ విదేశీ ఫలాన్ని ఇప్పుడు తెలంగాణ రైతులకు పరిచయం చేస్తోంది ఉద్యానవన శాఖ. జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌ లెన్సీలో ప్రయోగాత్మకంగా డ్రాగన్‌ పండును సాగు చేస్తున్నారు. భువనేశ్వర్‌ లోని ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ రీసెర్చ్‌, మిజోరంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టి కల్చర్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. గతంలోనూ ఉద్యానశాఖ బేర్‌ యాపిల్‌ను తెలంగాణ యాపిల్‌ గా పేరుపెట్టి రైతులకు అందుబాటులోకి తెచ్చింది. 
ఇప్పటికే గుజరాత్‌,మహారాష్ట్ర, కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ డ్రాగన్‌ ప్రూట్‌ను సాగు చేస్తున్నారు. మిర్యాలగూడలో రవి అనే రైతు 15 ఎకరాల్లో డ్రాగన్‌ ప్రూట్‌ను సాగు చేస్తున్నాడు.క్యాక్టె ప్యావిూలికి చెందిన డ్రాగన్‌ ప్రూట్‌ డయాబెటిక్‌, బీపి లను కంట్రోల్‌ చేస్తుందని చెప్తారు. అలాగే కొలెస్ట్రాల్‌ ను తగ్గించే గుణం ఫలంలో ఉంది. జ్యూస్‌ రూపంలోనూ డ్రాగన్‌ ఫ్రూట్‌ ను తీసుకోవచ్చు. వైన్‌ తయారీలో, సౌందర్యసాధనాల తయారీలో ఈ ఫ్రూట్‌ వాడుతున్నారు.

Comments