Skip to main content
పూరి జగన్నాథ్ తెలుగుకు పరిచయం చేసిన దిశాపటాని శ్రీమతి అయింది. బాలీవుడ్ యువహీరో టైగర్ ష్రాఫ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ తాజాగా పెళ్లి చేసుకున్నటుట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాకీచాన్ సినిమా 'కుంగ్ ఫూ యోగా', 'ఎంఎస్ ధోని..యాన్ అన్‌టోల్డ్ స్టోరి' చిత్రాల్లో నటించి వరల్డ్ వైడ్ అభిమానుల్ని పెంచుకుంది. సినిమాలతో కంటే ఫొటోషూట్లతోనే ఈ అమ్మడు యువతరానికి మరింతగా చేరువైందని చెప్పొచ్చు. దిశా జీవితంలో మరో ఆసక్తికర కోణం గురించి చెప్పుకోవాలి. ఈ అమ్మడు ఇటీవలి కాలంలో బాలీవుడ్ యువహీరో టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణంలో ఉంది. 'బేఫిక్రా' ఆల్బమ్‌లో కలిసి నటించినప్పటినుంచి ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందన్న ప్రచారం ఉంది. కలిసి రెస్టారెంట్లు, క్లబ్బు, పబ్బుల్లో తిరిగారన్న ప్రచారం సాగింది. అయితే మొన్నటికి మొన్న అంతకుమించి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఈ జోడీ. కొత్త సంవత్సర వేడుకల కోసం ఈ జంట శ్రీలంకకు పయనమైంది. అలా మొదలైన పయనంలో ఎన్నో ట్విస్టులు. ముంబై విమానాశ్రయంలోనే బోలెడంత మెలోడ్రామా. అసలు ఆ ఇద్దరూ విడివిడిగా వచ్చి విమానాశ్రయంలో కలుసుకుని సీక్రెట్‌గా విమానం ఎక్కారు. ఆ తర్వాత శ్రీలంక నుంచి విడివిడిగా ఉన్న ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కానీ ఇక్కడే మరో ట్విస్టు. ఈ జంట అక్కడ రహస్యంగా వివాహం చేసుకుందని తెలుస్తోంది. ఈ జోడీ దండలు మార్చుకుంటున్న కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో 'విరుష్క' సడెన్ ట్విస్ట్ తర్వాత మరో జంట అదే పంథాని అనుసరించిందని అంతా మాట్లాడుకుంటున్నారు. టైగర్ కుటుంబంతో అంత సాన్నిహిత్యం లేదని చెబుతున్న దిశా .. ఇంతలోనే ఇలా చేస్తుందా? ఈ సీక్రెట్ పెళ్లిపై ఏం చెబుతుందో చూడాలి.
Comments
Post a Comment