నయనతార..నిజంగా వెలిగిపోతున్న సమయంలో ప్రేమ గాయపరిచింది. ఈ సమయంలో చాలా మంచి ఆఫర్లు వచ్చినా తిరస్కరించింది. శింబుతో ప్రేయాణం..తరువాత బ్రేకప్..మళ్లీ ప్రభుదేవాతో లవ్ ట్రాక్..అది కూడా డిస్టర్ట్...ఇలా నయనతారతో ప్రేమ ఆడుకుంది. దీంతో మానసికంగా కుంగిపోయిన నయన్..సినిమా లోకం నుంచి పూర్తి వెళ్లిపోవాలనుకుంది. సినిమాల్లో నటించడం మానుకోవాలని చాలా బలంగా అనుకుంది. ఈ క్రమంలో శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రకు ఆఫర్ చేశారు. స్వయంగా బాలయ్య ఫోన్ చేసి సీత పాత్ర చేయాలని నయనతారను కోరాడట. దానికి సున్నితంగా నయన్ తిరస్కరించిందట. సినిమాలు మానేయాలని అనుకుంటున్నాని...నన్ను ఇబ్బంది పెట్ట వద్దని బాలయ్యతో అనేసిందట.. కానీ బాలయ్యకు ఎక్కడో చిన్న ఆశ మాత్రం ఉందట. అయితే నయన్ ఈ పాత్ర చేస్తుందని..తనే మళ్లీ ఫోన్ చేసి చెబుతుందని దర్శకుడు బాపూకి బాలయ్య చెప్పాడట. అలాగే మరుసటి రోజు సీత పాత్ర చేస్తున్నట్టు బాలయ్య ఫోన్ చేసి చెప్పిందట. ఇక ఈ సినిమాలో తన తండ్రి చేసిన పాత్రను చేయడానికి తాను కొంచెం భయపడ్డప్పటికీ బాపు గారున్నారనే ధైర్యంతో ముందుకెళ్లిపోయినట్లు బాలయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Comments
Post a Comment