గజల్ శ్రీనివాస్.. ఇప్పుడు ఆ మీడియా.. ఈ మీడియా అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈయన టాపిక్కే నడుస్తోంది. ఇన్నాళ్లూ సెలబ్రెటీ హోదా పొందిన ఈ మహానుభావుడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆడవాళ్లను లోబరుచుకోవడంలోనూ.. వారిని శారీరకంగా వాడుకోవడంలోనూ ఇతనికి చాలా అనుభవం ఉందన్న విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇతని బాధపడలేక ఓ అమ్మాయి సాహసం చేసి స్ట్రింగ్ ఆపరేషన్ చేయడంతో మొత్తం విషయం బట్టబయలైంది.
బాధితురాలు మొదట ఫిర్యాదు చేస్తే పోలీసులు నమ్మలేదట. దాంతో ఆ అమ్మాయి వీడియో సాక్ష్యాలు బయటపెట్టింది. అలా విషయం మీడియాకూ చేరింది. అంతటా వైరల్ అయ్యింది. గజల్ గలీజ్ పనులకు సంబంధించిన 3, 4 వీడియోలు పలు ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. పాపం ఛానల్ వాళ్లు నానా తంటాలు పడి ఆ వీడియోలను బ్లర్ చేసుకోవాల్సి వచ్చింది. ఐతే.. తాజాగా మరో విషయం వెలుగు చూసింది. గలీజ్ శ్రీనివాస్ కు సంబంధించిన మరిన్ని వీడియోలను బాధితురాలు మీడియాకు అందించింది.
దీన్ని బట్టి చూస్తే బాధితురాలు దాదాపు 20 వరకూ వీడియోలను పోలీసులకు అందించిందట. మరిన్ని వీడియోలు వెలుగుచూడటంతో ఛానళ్లు మరోసారి ఈ గలీజ్ శ్రీనివాస్ కథనాలతో పండుగ చేసుకున్నాయి. కొన్ని ఛానళ్లు.. అబ్బో ఇంత గలీజా మేం ప్రసారం చేయలేం బాబూ అని బాధ్యత కూడిన సిగ్గుపడితే.. మరికొన్ని ఛానళ్లు మాత్రం అహా.. ఓహో అంటూ పండుగ చేసుకున్నాయి. వీడియో 1, వీడియో 2, వీడియో 3 వీడియో 4 అంటూ నెంబర్లు వేసి మరీ హోరెత్తించాయి.
ఈ వీడియోల్లో బాధితురాలితో పాటు మరికొందరి వీడియోలు కూడా ఉన్నాయట. ఈ వీడియోల ఆధారంగా గజల్ శ్రీనివాస్ మరింతగా చిక్కుల్లో కూరుకుపోయినట్టే కనిపిస్తోంది. అతనికి బెయిల్ దొరకడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి కామాంధుడి లీలలను సాహసంగా రికార్డు చేసి పక్కా ఆధారాలతో బయటపెట్టిన బాధితురాలి ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. మొదట్లో బాధితురాలిని కూడా వెటకారంగా కామెంట్ చేసిన వారు కూడా ఇప్పుడు అన్ని వీడియోలు చూసిన తర్వాత గజల్ శ్రీనివాస్ ను మరింతగా అసహ్యించుకుంటున్నారు. అందుకే అన్నారు కామాతురాణాం.. నభయం.. నలజ్జ.. అని.
'గజల్' కు అనుకూలంగా మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నా..: మంత్రి
అమరావతి: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ వీడియోలు చూసి షాకయ్యానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గజల్ శ్రీనివాస్కు అనుకూలంగా బుధవారం నేను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని పేర్కొన్నారు. నా వ్యాఖ్యల అనంతరం కొందరు కలిశారన్నారు. తర్వాత వీడియోలు చూసిన నేను షాకయ్యా... నేను మాట్లాడిన దానికి సిగ్గుపడుతున్నా... నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి అన్నారు. అంతేగాక గజల్ శ్రీనివాస్లో ఇన్నాళ్లు నాణేనికి ఓ వైపే చూసాను... ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తని అనుకోలేదు... ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు...' ఆయనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి...
అంటూ మాణిక్యాలరావు అన్నారు. కాగా... గజల్ శ్రీనివాస్ కేసులో ఏదో కుట్ర దాగి ఉందని, గజల్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని మంత్రి మాణిక్యాలరావు బుధవారం విలేకరులతో అన్న విషయం తెలిసిందే.

Comments
Post a Comment