కర్నూలు జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఆస్పరి మండలం చిన్నహుల్తీ రైల్వే గేటు దగ్గర టైర్ పంక్చరై లారీ బోల్తా కొట్టింది. దీంతో లారీలో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మరో 10 మంది గాయపడ్డారు. జిల్లాలోని ¬లగుంద మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పలువురు కూలీలు గుంటూరు జిల్లాకు వలస వెళ్లి అక్కడ కూలీ పనులు నిర్వహించుకుని తిరిగి స్వగ్రామానికి లారీలో వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. లారీ టైరు పంక్చర్ కావడంతో బోల్తా కొట్టింది. దీంతో కూలీల బతుకులు చిధ్రమైపోయాయి.

Comments
Post a Comment