ఆ తానులో ముక్కే..

ఔను మీరు ఊహించింది కరెక్టే. నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వను. మీకు నచ్చితే ఓటు వేయండి..లేకుండే వేయవద్దు..ఇది జనసేనాని చెప్పిన మాటలు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తాట తీస్తానని కాటమరాయుడు హెచ్చరించాడు. సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌లా ప్రశ్నిస్తానన్నాడు. ఎన్నికల్లో బాబు గెలిచాడు..ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు..సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌ ఫ్లాప్‌ అయింది...కాటమరాయుడు బాక్సాఫీసు వద్ద తుస్‌ మంది. ఆయనకు సపోర్టు కావాలి..ఈయనో హిట్‌ కావాలి. మళ్లీ నువ్వంటే నాకిష్టం అంటూ పాటేసుకున్నారు అజ్ఞాత‌వాసి
. జగన్‌ పాదయాత్రకు జన స్పందన చూసి బాబు స్కెచ్‌ వేశాడు..అంతే కల్యాణ్‌బాబు రంగంలోకి దిగాడు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించేశాడు. ఇప్పటికైనా రంగంలోకి దిగినందుకు అభినందించాల్సిందే..పవన్‌ రాజకీయాలు చేసుకోనే..ఎవరికీ ఇబ్బంది లేదు...ఎవరి టాలెంట్‌ వారిది. ఎటొచ్చీ ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే..ప్రజలనే ముందు కలవాలి. మరి పరిటాల ఫ్యామిలీని ఎందుకు కలిసినట్టో. అనంతపురంలో ప్రభాకర్‌ చౌదరి ఇంట్లో డిన్నర్‌...మరుసటి రోజు ఉదయం పరిటాల సునీత ఇంట్లో బ్రేక్‌ ఫాస్ట్‌..భలే ఉంది బాబు స్క్రీన్‌ప్లే..రైతులకు బాసటగా నిలిచేవారికే మద్దతు ఇస్తానని చెప్పి 24 గంటలు గడవక ముందే రైతులనునట్టేట ముంచుతున్న తెలుగుపార్టీ నేతలతో పవన్‌ ఇలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు వరుసుగా తెలుగుదేశం నాయకులతో ఆయన భేటీ అవుతుండడం కూడా ఇది పక్కా పచ్చ స్కెచ్‌ అని వేరే చెప్పనక్కర్లేదని సోషల్‌ మీడియా నెట్‌ ఇంట్లో ఒకటే విమర్శిస్తోంది. పవన్‌ కల్యాణ్‌ అనంతపురం వెళ్లి.. తన రాజకీయం గురించి క్లారిటీ ఇస్తాడని అనుకుంటే.. మరో రకమైన క్లారిటీ ఇచ్చాడు. తన పార్టీ తెలుగుదేశం పార్టీ తానులో ముక్కే అని తేటతెల్లం చేశాడు. రాయలసీమ డెవలప్‌ మెంట్‌ గురించి పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం వాళ్లతో చర్చలు జరిపాడట. వీళ్లు ఇచ్చిన నివేదికను తీసుకుని వెళ్లి ప్రధానమంత్రిని కలవనున్నాడట పవన్‌ కల్యాణ్‌. 

కరువును పారద్రోలడానికి ఈ అధ్యయనం అంతానట.. అయినా కరువే లేదు అని చంద్రబాబు చెబుతుంటే, కరువును పారద్రోలడానికి పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తాడో మరి. అలాగే పరిటాల ఇంటికి వెళ్లడం ద్వారా గుండు విషయంలో కూడా విబేధాలు తొలగిపోయినట్టే అని జనసేన అభిమానులు అంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ కు పరిటాల రవి గుండు కొట్టించాడనే ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. తనకు ఎవరూ గుండు కొట్టించలేదని పవన్‌ కల్యాణ్‌ ఆ మధ్య చెప్పాడు. అయితే ఇప్పుడు.. డైరెక్టుగా పరిటాల వాళ్ల ఇంటికి వెళ్లడం ద్వారా పవన్‌ కల్యాణ్‌ గుండు విబేధాలు ఏవీ లేవు సుమా.. అని అందరికీ స్పష్టత ఇచ్చాడు. అలాగే పరిటాల సునీత కూడా పవన్‌ గుండుపై క్లారిటీ ఇచ్చారు. పరిటాల రవి...వపన్‌ కల్యాణ్‌కు గుండు కొట్టించారని పత్రికల్లో..యువతలో ప్రచారం జరిగిన విషయం మా దృష్టికీ వచ్చిందని, అయితే రవి చాల మంచోడని, ఆయన పవన్‌కు గుండు కొట్టించలేదని స్పష్టం చేశారు. కరువు అధ్యయనం చేయాలంటే రైతులతో మాట్లాడాలి. అక్కడ పరిస్థితులను స్వయంగాచూడాలి. నివేదకి తయారు చేసుకోవాలి. తెలుగుదేశం అండ్‌ టీంతో కరువుపై చర్చలు జరిపి వారిచ్చిన నివేదకతో ఢిల్లీ వెళితే ప్రయోజనేమేంటో పవన్‌ గారే చెప్పాలి. మొత్తానికి పవన్‌ యాత్రలో ఓ అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అదేంటంటే పచ్చబాటలోనేనని..

Comments