గూడూరులో భారీ అగ్ని ప్రమాదం


 
  • తిలకనగర్‌ శ్రీ సాయిక్రిష్ణ సామిల్లులో షార్ట్‌ సర్కూట్‌ 
  • మంటల్లో కాలిపోయిన మిల్లు...రూ.2లక్షల ఆస్తి నష్టం
నెల్లూరు : గూడూరు పట్టణం లోని తిలక్‌ నగర్‌ శ్రీ సాయి క్రిష్ణ సామిల్లులో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.మిల్లు లోని విద్యుత్తు విూటరు వద్ద విద్యుత్తు షార్ట్‌ సర్కూట్‌ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో మిల్లుకు ఉపమోగించే మోటార్లు, పరికరాలు,కలప కాలి పోయాయి. మిల్లు లో నుంచి మంటలు,పొగలు చెల రేగడంతో స్థానికులు మిల్లు యజమాని కాకర్ల చిన స్వామికి సమాచారం అందించారు. యజమాని అక్కడకు చేరుకుని గూడూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.ఈ ప్రమాదంలో షుమారు రూ.2లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. బ్రతుకు జీవనానికి ఆధారమయిన మిల్లు మంటల్లో కాలిపోవడంతో యజమాని తీవ్రంగా నష్ట పోయాడు.సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది.

Comments