ఆంధ్రా కశ్మీర్‌గా పిలవబడే విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లంబసింగిలో 3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా... చింతపల్లి, మోదకొండమ్మపాదాలులో 5 డిగ్రీలు, మినుములూరులో 6, అరకులో 7, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికి తోడు పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా రహదారి కూడా కనబడకపోవడంతో లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఏజెన్సీలో చలి తీవ్రత అధికమవడంతో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు...

Comments
Post a Comment