థంప్స్‌ అప్‌ హానికరమే...కానీ శ్రీమంతుడు చెబుతున్నాడుగా తాగేయండి...!


పొగాకు ఆరోగ్యానికి హాని కరం...మద్యపానం హాని కరం...ఇవి అటు సిగరెట్‌ ప్యాకెట్లపై..ఇటు మద్యం బాటిళ్లపై రాసే ఉంటాయి. అయినా గుప్పుగుప్పుమంటూ ఊదేస్తున్నారు...పెగ్‌ మీద పెగ్‌లూ తాగేస్తున్నారు.  మీ ప్రాణాలు పోతాయి అని ఉన్నా పట్టించుకోవడం లేదు. వెధవ ప్రాణం ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్లు భావిస్తున్నవాళ్లు ఉండబట్టే ఈ వ్యాపారం మూడు సిగరెట్లు ఆరు పెగ్‌లా కళకళలాడుతోంది.
 అరె నేను మందు తాగన్రా ఓ థంప్స్‌ అప్‌ చెప్పు ..మీరు మందు తాగండి నేను థంప్స్‌ అప్‌ తాగుతా అన్నవాళ్లు మీ సర్కిల్‌లో తగిలే ఉంటారు. ఇకపై వాళ్లు థంప్స్‌ అప్‌ అడిగినా ఇవ్వొద్దు...ఎందుకంటే ఇందులో కూడా ఆల్కాహాల కంటెంట్‌ ఎక్కువ ఉందట. ఈ మధ్య కాలంలో ప్రధాన పత్రికల మొదటిపేజీల్లో అచ్చవుతున్న ప్రకటనలో ప్రత్యేకం ఇలా రాసుంది...టేక్‌ చార్జ్‌...థంప్స్‌ అప్‌ ఛార్టెడ్‌ ఆనేది కెఫినేటెడ్‌ పానీయం. అత్యధిక కెఫిన్‌ 38.8.ఎంజీ సర్వింగ్‌(1సర్వింగ్‌ = 250ఎంఎల్‌). పిల్లలు, గర్భిణులు లేదా పాలిచ్చే తల్లులకు, కెఫిన్‌కు సున్నితంగా స్పందించే వ్యక్తులకు సిఫారసు చేయబడదు.  ప్రతి రోజూ 500ఎంఎల్‌ కంటే ఎక్కువ వినియోగించరాదు. అని హెచ్చరిక కూడా ఉంది. ఈ దిక్కుమాలిన బ్రాండ్‌కు ప్రిన్స్‌ మహేష్‌ బాబు అంబాసిడర్‌. ప్రజలకు హాని చేసే ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్లగా ఉండకూడదని గతంలో కొందరు హీరోలు నిర్ణయించుకున్నారు. తమిళంలో రజనీ, సూర్య, కన్నడలో ఉపేంద్ర తదితరులు ఇటువంటి ఉత్పత్తులు ప్రచారం చేయబోమని స్పష్టం చేశారు. బాలీవుడ్, టాలీవుడ్‌లోనే మన హీరోలు అత్యధిక రెమ్యునరేషన్‌కు ఆశపడి..ప్రజల ఆరోగ్యంతో పనేంటంటూ ఇలా ప్రచారానికి ఒడిగడుతున్నారు. ఒక హీరో ప్రభావం జనాలపై ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్లూవేల్‌ గేమ్‌ ఆడి ప్రాణాలు తీసుకునే వెర్రి జనాలున్న ప్రపంచంలో తమ అభిమాన నటులు ఒక ప్రాడెక్టుకు అంబాసిడర్‌గా ఉంటే ఆ ఉత్పత్తులు ఎంత బాగా పాపులర్‌ అవుతాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అత్యధిక పారితోషికం ఇచ్చి మరి ప్రకటనల్లో నటింపజేస్తుంటారు. గతంలో చాలా మంది నటులు ప్రజలకు హాని కలిగించే ఉత్పత్తులకు ప్రచారం చేశారు. చేస్తునే ఉన్నారు. ఒకరికి తమ ప్రాడెక్టు బాగా అమ్ముడు పోవాలి...మరొకరికి అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలన్న తపన. ఇంత పబ్లిక్‌గా వ్యాపారం చేస్తున్నా ప్రభుత్వం వీటిని నిషేదించకుండా విచ్చలవిడిగా అమ్ముకోండని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు థంప్స్‌ అప్‌ యాడ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రిన్స్‌ మహేష్‌ బాబుపై కూడా నెట్‌ జనులు విరుచుకుపడుతున్నారు. శ్రీమంతుడు..ఇటువంటి ప్రకటనల్లో నటించవద్దని తమ అభిమాన నటుడికి సూచిస్తున్నారు. 

Comments