సుక్కు కథకు చిరు ఫిదా

సుకుమార్‌ (సుక్కు)..మెగాస్టార్‌ చిరంజీవి కలయికలో ఓ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. త్వరలోనే అన్నీ అనుకూలిస్తే ఓ భారీ చిత్రం ముందుకు రానుంది. సుక్కు చెప్పిన కథకు చిరు ఫిదా అయిపోయాడు. స్క్రిప్ట్‌ పూర్తిగా రెడీ చేసి తీసుకురమ్మని భరోసా ఇచ్చాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌, సమంతా జోడీగా రంగస్థలం చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ దాదాపు పూర్తికావొచ్చింది. మార్చి 30న సమ్మర్‌ స్పెషల్‌ ఈ మూవీ రిలీజ్‌ చేయనున్నారు. చరణ్‌ ఈ చిత్రంలో పూర్తిగా హీరోయిజాన్ని పక్కన పెట్టి చెవిటివాడిగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్‌ టైం లో రామ్‌ చరణ్‌ సహాయంతో చిరంజీవికి ఒక కథ చెప్పాడట సుకుమార్‌. 25 నిమిషాల పాటు సుకుమార్‌ చెప్పిన ఈ కథ విని చిరంజీవి ఇంప్రెస్‌ అయినట్టు తెలిసింది. కాన్సెప్ట్‌ నచ్చిన చిరంజీవి సుకుమార్‌ ని పూర్తి కథ డెవలప్‌ చేసుకొని రమ్మన్నట్టు తెలుస్తుంది. 
అయితే రంగస్థలం పనులు మొత్తం ఫిబ్రవరిలో అయిపోతాయి. దీంతో ఆ స్క్రిప్ట్‌ ను వీలైనంత త్వరగా ఫినిష్‌ చేసి చిరంజీవిని మెప్పించాలని అనుకుంటున్నాడట సుకుమార్‌. ప్రస్తుతం మెగాస్టార్‌ ''సైరా'' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తరువాత చిరంజీవి ఇంకా ఏ మూవీ ఒకే చెయ్యలేదు. కానీ సుకుమార్‌ మాత్రం మహేష్‌ బాబుకు ఒక కథ చెప్పి ఉంచాడు. మరి సుకుమార్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌ కోసం ఏ హీరో ని ఎంచుకుంటాడో చూడాలి.

Comments