గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సీఎస్‌ సవిూక్ష

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో 26న గణతంత్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రధాన శాఖలు ప్రత్యేక బృందాలను ఖరారు చేసి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ అధికారులను ఆదేశించారు. బందో బస్తుతోపాటు ట్రాఫిక్‌ నియంత్రణ ఏర్పాట్లు చేపట్టాలని పోలీస్‌ శాఖాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విభాగాల అధికారులతో సచివాలయంలో సోమవారం సమావేశమై గణతంత్ర వేడుకల ఏర్పాట్లను సవిూక్షించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పరేడ్‌ మైదానంలో పారిశుధ్యం, మొబైల్‌ టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో పాటు గన్‌పార్క్‌, క్లాక్‌టవర్‌, ఫతేమైదాన్‌, రాజ్‌భవన్‌, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్‌తోపాటు చారిత్రాత్మక భవనాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని సీఎస్‌ ఆదేశించారు.

Comments