మాయ'లేడి'

మాయ మాటలు చెప్పింది. కవ్వించింది. ఆ ఎన్నారై పడిపోయాడు..ఫిదా అయిపోయాడు. పూర్తిగా నమ్మేశాడు. కట్‌ చేస్తే ఇది ఓ సినిమా కథలా కళ్లముందు కనిపించేసరికి లబోదిబోమన్నాడు. ఆమెను నమ్మి 41 లక్షలు వరకూ పోగొట్టుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే..ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెన్నైకు చెందిన తమిళ వర్ధమాన నటి శ్రుతి మోసానికి పాల్పడింది. అతని వద్ద రూ.41 లక్షలు లాక్కుంది. ఈ సంఘటన నేపథ్యంలో శ్రుతిని, ఆమె తల్లి, సోదరుడితో పాటు శ్రుతకి తండ్రిగా నటించిన వ్యక్తిని అరెస్టు చేశారు. సేలంకు చెందిన జి.బాలమరుగన్‌, జర్మనీలో ఓ ఆటోమొబైల్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. వివాహితుడు కావడంతో 2017లో మేలో అతను తన ప్రొఫైల్‌ను మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో ఉంచాడు.ఇదే వెబ్‌ సైట్‌ ద్వారా శ్రుతి అతనికి పరిచయం అయింది. తన పేరును మైథిలీ వెంకటేష్‌గా పరిచయం చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యుల ఫొటోలను అతనికి పంపింది. ఇలా రోజులు గడిచిన తరువాత తన ఆరోగ్యం బాగోలేదని, బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉందని, శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు పేర్కొన్నట్టు చెప్పింది. ఆ తరువాత తల్లి ఆరోగ్యం కూడా బాగోలేదని, ఆమెకు గుండె ఆరేషన్‌ చేయించాలని చెప్పింది. నిజమని నమ్మిన బాలమురుగన్‌ పలు వాయిదాల్లో 41 లక్షల రూపాయలను పంపించాడు. కొన్నాళ్లు గడిచిన తరువాత శ్రుతి ఫొటోలను తన బంధువులకు, స్నేహితులకు చూపించాడు. ఈమె ఓ నటి అని తేలడంతో అసలు విషయం బయటపడింది. దీంతో మురుగన్‌ ఫిర్యాదుతో నిందితులను అరెస్టు చేశారు.

Comments