Skip to main content
బెంగళూరు మందుబాబుల రికార్డ్
73,741 డ్రంకెన్ డ్రైవ్ కేసుల నమోదు
బెంగళూరు : డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో దేశంలోనే బెంగళూరు నగరం రికార్డు సృష్టించింది. గత సంవత్సరం బెంగళూరులో 73,741 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదైనాయని పోలీసు రికార్డులు స్పష్టం చేశాయి. 2016వ సంవత్సరంలో 59,028 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదు కాగా 2017లో వీటీ సంఖ్య 25 శాతం పెరిగింది. నిరంతరం తనిఖీలతో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై ఎక్కువ కేసులు నమోదైనాయి. సాధారణ వాహనచోదకులే కాకుండా అంబులెన్స్ డ్రైవర్లు, స్కూలు బస్సులు నడిపే డ్రైవర్లు కూడా మద్యం తాగి నడిపారని పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. సంవత్సరం మొత్తంలో ఒక్క డిసెంబరు నెలలోనే అత్యధికంగా 10,517 కేసులు నమోదైనాయి.
Comments
Post a Comment