నాగార్జున ఇష్టపడే నటి అనుష్క. దాదాపు ఇద్దరూ కలిసి అరడజను సినిమాల్లో నటించారు. ఇద్దరి కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ అదుర్సే. అందుకే కనీసం చిన్న పాత్రలోనైనా అనుష్కను నటింపజేస్తాడు నాగ్. అయితే ఈసారి అనుష్క కాదని మరో బ్యూటీ వైపు నాగ్ మనసు మార్చుకున్నాడు. బరిలోకి రకుల్ కూల్‌గా దిగుతోందిట. ఫర్ ఏ ఛేంజ్.. అనుష్క స్థాయి ఛరిష్మా ఉన్న పంజాబీ బ్యూటీ రకుల్ ఈసారి నాగార్జున సరసన నటిస్తుందని తెలుస్తోంది. నాగార్జున, నాని కథానాయకులుగా ఆదిత్య శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న సినిమాలో రకుల్‌ను ఓ కథానాయికగా ఫైనల్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ సహా కాస్టింగ్ సెలక్షన్స్ సాగుతున్న ఈ సినిమాకి రకుల్ అదనపు అస్సెట్ కానుంది. ఇక ఈ అందాల భామ హిందీ చిత్రం 'అయ్యారి' రిపబ్లిక్ డే కానుకగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే బాలీవుడ్‌లో విస్త్రతంగా ప్రచారంతో బిజీగా ఉంది రకుల్. సూర్య 36వ సినిమాలోనూ రకుల్ నాయిక. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేశ్‌బాబు-వంశీపైడిపల్లి కాంబినేషన్లో సినిమాకి రకుల్‌నే ఎంపిక చేసుకునే అవకాశాలున్నాయన్న వార్తలొచ్చాయి. దట్స్ ద బ్యూటీ రకుల్!!

Comments
Post a Comment