సంక్రాంతి పండుగకి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు 32 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక రైలు సర్వీసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ - కాకినాడ నగరాల మధ్య జనవరి 13న ప్రత్యేక రైలు, సికింద్రాబాద్ -నర్సాపూర్ మధ్య జనవరి 12వ తేదీన సువిధ రైలుతో పాటు హైదరాబాద్ - కొచ్చువేలి- హైదరాబాద్ మధ్య 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ - కొచ్చు వేలి మధ్య జనవరి 20 నుంచి మార్చి 31వ తేదీ వరకు ప్రతీ ఆదివారం ప్రత్యేక రైలు సర్వీసు, తిరుగు ప్రయాణంలో కొచ్చువేలి నుంచి జనవరి 22వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రతీ సోమవారం ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నారు. కాచిగూడ- భువనేశ్వర్- కాచిగూడ మధ్య ఆరు ప్రత్యేక హమ్ సఫర్ రైళ్లు నడిపేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భువనేశ్వర్- కాచిగూడ మధ్య ఈ నెల 11 నుంచి 25 వరకు ప్రతీ గురువారం, తిరుగు ప్రయాణంలో కాచిగూడ నుంచి భువనేశ్వర్‌కు ఈ నెల 12 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం హమ్ సఫర్ రైలు సర్వీసు నడిపించనున్నారు.
వీటితో పాటు సికింద్రాబాద్ - గూడురు మధ్య జనవరి 11న ప్రత్యేక రైలు సర్వీసు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.
వీటితో పాటు సికింద్రాబాద్ - గూడురు మధ్య జనవరి 11న ప్రత్యేక రైలు సర్వీసు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.

Comments
Post a Comment