ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం: విద్యార్థి దుర్మరణం

రంగారెడ్డి: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన ఓ దుర్మరణం పాలయ్యాడు. శంషాబాద్‌ రింగ్‌ రోడ్డుపై కారు ప్రమాదం జరిగింది. దీంతో అనన్య యోగాల్‌(22) అనే హెచ్‌సీయూ విద్యార్ధి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కాగా... సమాచారమందుకున్న పోలీసులు హూటాహుటిన ప్రమాదస్థలిని సందర్శించి గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు

Comments