ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తాజాగా మరో మైలురాయిని అందుకున్నాడు కోహ్లీ. భారత తరపున అత్యధిక టెస్టు పరుగులు సాధించిన కెప్టెన్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగుల రికార్డును సాధించాడు. కాగా ఈ రోజు చేసిన ఈ పరుగులతో టెస్టుల్లో భారత సారథిగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. గతంతో మహేంద్ర సింగ్ ధోనీ చేసిన 3454 పరుగుల రికార్డును కోహ్లీ 35 టెస్టుల్లోనే అధిగమించాడు. 3,454 పరుగులను ధోనీ 60 టెస్టుల్లో చేశాడు. అయితే.. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత మూడో ఆటగాడిగా గవాస్కర్ ఉన్నారు. ఆయన 47 టెస్టుల్లో 3449 పరుగులు చేశారు.

Comments
Post a Comment