'నిత్య'నూతనంగా..

నిత్య..మంచి నటి..కళ్లతోనే భావాలు పలికించే అద్భుత నటి. విలక్షణ పాత్రలో మెప్పిస్తూ ప్రేక్షకుల ఆదరణ చూరగొంది. ఇటీవల ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తిరిగి ఫాంలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే నాని నిర్మాతగా మారి రూపొందిస్తున్న అ! సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ సినిమా తరువాత బహు భాషా చిత్రంగా తెరకెక్కనున్న ఓ ఆసక్తికర చిత్రంలో నటించేందుకు అంగీకరించింది.సినిమాటోగ్రాఫర్‌ నిజార్‌ షఫీ దర్శకుడిగా మారి రూపొందిస్తున్న సినిమాలో నిత్యవిూనన్‌ కీలక పాత్ర పోషించనుందట. ముందుగా ఈ పాత్రకు అంజలిని తీసుకున్నారన్న ప్రచారం జరిగినా.. చిత్రయూనిట్‌ నిత్య విూనన్‌ రను తీసకునేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కథ విన్న నిత్య, ఈ సినిమాలో నటించేందుకు సుముఖంగానే ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. నలుగురు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో ఇతర పాత్రల్లో అనీషా ఆంబ్రోస్‌, అదితి ఆర్య, నందిత శ్వేతలు నటించనున్నారు.

Comments