అంతర్గత వివరాలు వాట్సప్‌ గ్రూపుల్లో పెట్టొద్దు


 
  • పోలీసుకు డీజీపీ వార్నింగ్‌
అమరావతి : పోలీసుశాఖకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలను బయటి వ్యక్తులతో పంచుకోవడం ఏమిటని పోలీసుశాఖ జిల్లాల్లోని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌర సమాజంలోని వ్యక్తులు, పాత్రికేయులు తదితరుల నెంబర్లలో జిల్లాల్లో వాట్సాప్‌ గ్రూపులు సృష్టించి రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని అందులో పోస్టు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని జిల్లాల్లో కేసు దర్యాప్తునకు సంబంధించిన వివరాలు, మరికొన్ని చోట్ల బందోబస్తు ఏర్పాట్ల వివరాలు, ఇతర పోలీసు వ్యూహాల గురించి కూడా వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేసినట్లు తెలిసింది. ఇటువంటి సమాచారం బయటికి వచ్చి పత్రికలు, టీవీల్లో వస్తే సమాజానికి ప్రమాదమని పోలీస్‌ బాస్‌ మాలకొండయ్య ఆక్షేపించినట్లు తెలిసింది. ఇకపై వాట్సాప్‌ గ్రూపుల్లో పోలీసులకు సంబంధించిన అంతర్గత చర్చల వివరాలు ఎవరు పోస్టు చేసినా చర్య తీసుకోవాలని ఎస్పీలను డీజీపీ ఆదేశించారు.

Comments