మనకిష్టమైనది ఏదైనా ఏ సమయంలోనైనా చేయడానికి సిద్ధపడతాం. చెన్నైకి చెందిన కవిత కూడా తన ఇష్టాన్ని గిన్నిస్ బుక్ రికార్డ్ వరకూ తీసుకువెళ్లింది. పెళ్లైన తరువాత కూడా తన పట్టుదలను వీడకుండా యోగలో ఆసనాలు వేసి వరెవ్వా అనిపించింది. చిన్నప్పట్నుంచి యోగాలో నైపుణ్యం సాధించిన కవిత.. పెళ్లయిన తర్వాత కూడా రికార్డులు బద్దలు కొడుతున్నది. గతంలో ఓ వ్యక్తి 103 గంటల పాటు యోగా చేస్తేనే వామ్మో అన్నారు. అయితే కవిత భరణిధరన్ తాజాగా 170 గంటల పాటు యోగాసనాలు వేసి చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన ఈ ఫీట్‌తో కవిత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 180 గంటల పాటు యోగా చేయాలనుకున్న కవిత.. అనివార్య కారణాల వల్ల 170 గంటలే యోగా చేసిందట. వచ్చే ఏడాది మరోసారి ఈ మారథాన్ నిర్వహిస్తానని చెబుతున్నది. ఓ మహిళ 100 గంటలకు పైగా యోగా చేయడం ఇదే తొలిసారి. గతంలో ఓ మహిళ నిర్విరామంగా 67 గంటల పాటు యోగా చేసింది. డిసెంబర్ 23న యోగా ప్రారంభించిన కవిత.. డిసెంబర్ 30తో యోగాసనాలు ముగించింది.

Comments

స్టోరీ స్ఫూర్తిదాయకంగా వుంది.
ReplyDelete