హోటల్స్ స్టార్ రేటింగ్స్ వివరాలను విధిగా రిసెప్షన్‌లో డిస్ ప్లే చేయాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. దేశంలో విదేశీ పర్యాటకుల సంఖ్య ఇటీవల పెరిగిన నేపథ్యంలో ¬టళ్లు తమ స్టార్ రేటింగ్స్ ను ఆన్ లైన్ లోనూ విధిగా పెట్టాలని కేంద్రం ఆదేశించింది. ¬టళ్లలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయరాదని,అలా ఏర్పాటు చేస్తే ఆ ¬టల్ కు స్టార్ రేటింగ్ ఇవ్వమని స్పష్టం చేసింది.హోటల్స్ బార్ లలో తప్ప ఆవరణల్లో మద్యం సరఫరా చేయరాదని కేంద్ర పర్యాటక శాఖ ఆదేశించింది.

Comments
Post a Comment